: ఏపీ వాటాలో 48 టీఎంసీలు ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే.. సూచించిన బజాజ్ కమిటీ
కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ వాటాలో 48 టీఎంసీలను ఎగువ రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని బజాజ్ కమిటీ సూచించింది. 45 టీఎంసీలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం ఉన్న మాట వాస్తవమేనని పేర్కొంది. ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చిందని, దీంతో ఎగువ రాష్ట్రాలకు వాటా మొదలైందని కమిటీ తెలిపింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను సందర్శించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు పేర్కొంది. గోదావరి నది నీటిని పలుచోట్ల తెలంగాణ వాడుకుంటున్నట్టు ఏపీ అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని, వారి అభ్యంతరాలను పరిశీలిస్తామని కమిటీ పేర్కొంది.