: మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం శశికళకు లేదు: మైత్రేయన్
అన్నాడీఎంకే పార్టీ నుంచి తమను సస్పెండ్ చేసే అధికారం శశికళకు లేదని పన్నీర్ సెల్వం మద్దతుదారుడు వి.మైత్రేయన్ మండిపడ్డారు. అన్నాడీఎంకే లో ఆమెకు ఎలాంటి పదవి లేదని, ఎమ్మెల్యేల నుంచి పళని స్వామి బలవంతంగా సంతకాలు సేకరించారని ఆయన ఆరోపించారు. పన్నీర్ సెల్వం వర్గానికి బల నిరూపణకు అవకాశం ఇస్తే తమ మెజారిటీ నిరూపించుకుంటామని అన్నారు. కాగా, గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన పన్నీర్ సెల్వం వర్గం మరో నేత పాండ్య రాజన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని , ప్రభుత్వం ఏర్పాటుకు తమనే ఆహ్వానించాలని కోరారు.