: పాక్ ను దోవలో పెట్టాలంటే ఆ మార్గమే సరైంది: రక్షణ శాఖ నిపుణుడు


పాకిస్థాన్ ను దోవలో పెట్టాలంటే సర్జికల్ దాడులే సరైనవని రక్షణ శాఖ నిపుణుడు కమర్ అఘా పేర్కొన్నారు. కాశ్మీర్ లోని బండిపురా జిల్లాలో ఈ రోజు ఉదయం వరకు కొనసాగిన ఎన్ కౌంటర్ ను దృష్టిలో పెట్టుకుని ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్ కౌంటర్ లో మన సైనికులు ముగ్గురు వీర మరణం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని, అందులో కొంత భాగాన్ని పాక్ ఆక్రమించిందని, ఆ భూ భాగాన్ని తిరిగి శాంతియుతంగా భారత్ కు అప్పగించాలని అన్నారు. ఈ విషయమై ఎలాంటి వివాదం లేకుండా శాంతియుత పరిష్కార మార్గం ద్వారా తమ భూభాగం తమకు అప్పగించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ క్రమంలో పాక్ పై ఒత్తిడి తీసుకు వచ్చే సమయం ఆసన్నమైందని, సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్థాన్ పాల్పడుతోందని, దీనికి ప్రతిగా భారత్ గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని అన్నారు.

  • Loading...

More Telugu News