: గవర్నర్ కు ఫోన్ చేసిన పన్నీర్ సెల్వం


అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం తమిళనాడులో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తమ శాసనసభాపక్ష నేతగా పళనిస్వామిని శశికళ ఎంపిక చేశారు. ఆ తర్వాత పళనిస్వామికి గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. దీంతో 10 మంది మంత్రులతో కలసి గవర్నర్ ను కలిసేందుకు ఆయన బయల్దేరారు.
 
ఈ నేపథ్యంలో, గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఫోన్ చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, బలాన్ని నిరూపించుకునేందుకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరారు. 

  • Loading...

More Telugu News