: మరో నలుగురు నేతలను బహిష్కరించిన శశికళ
అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఇప్పటికే పన్నీర్ సెల్వం ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో నిర్ణయం తీసుకున్నారు. పన్నీర్ సెల్వంకు మద్దతు తెలిపిన సీనియర్ నేతలను కూడా బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్నాడీఎంకే పార్టీ నుంచి కె.పాండ్యరాజన్, పీహెచ్. పాండ్యన్, పొన్నయన్, ఎన్. విశ్వనాథన్‌లను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో గంట గంటకీ అక్కడి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పుని ప్రకటించిన నేపథ్యంలో ఇక గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.