: సంబరాలు ఎందుకు? బతికుంటే జయ కూడా జైలుకు వెళ్లేది: వర్మ
అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత అన్నాడీఎంకేలోని ఒక వర్గం సంబరాలు జరుపుకుంటోందని... అయితే ఈ కేసులో ప్రథమ దోషి అమ్మ జయలలితే అనే విషయాన్ని వారు మర్చిపోయినట్టున్నారని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎద్దేవా చేశాడు. జయలలిత బతికుంటే... సుప్రీంకోర్టు తీర్పుతో ఆమె కూడా జైలుకు వెళ్లుండేవారని ట్వీట్ చేశాడు. కాలం చాలా విచిత్రమైనదని... ఇప్పటి దాకా శశికళ బందీలుగా ఎమ్మెల్యేలు ఉంటే... కోర్టు తీర్పు తర్వాత ఎమ్మెల్యేలు స్వేచ్ఛను పొందితే, శశికళ బందీగా మారిందని అన్నాడు.