: సెల్వంకు పన్నీరు... శశికళకు కన్నీరు!
అక్రమాస్తుల కేసులో శశికళను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక హైకోర్టు తీర్పును కొట్టిపారేసిన సుప్రీంకోర్టు... శశికళను దోషిగా నిర్ధారించింది. ఆమెతో పాటు దివంగత జయలలిత, ఇళవరసి, సుధాకరణ్ లను దోషులుగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. వీరందరికీ నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు పదేళ్ల పాటు శశికళ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సుప్రీం తీర్పుతో పన్నీర్ సెల్వం శిబిరంపై పన్నీరు కురవగా... శశికళ శిబిరంలో కన్నీరు పెల్లుబుకుతోంది.