: క్షణాలు యుగాల్లా... రాత్రంతా నిద్రపోని శశికళా నటరాజన్!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో, శశికళ క్షణాలను యుగాల్లా గడుపుతున్నారని సమాచారం. నిన్న సాయంత్రం తన వర్గం ఎమ్మెల్యేలు సేదదీరుతున్న గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లి, వారితో సమావేశమైన శశికళ, రాత్రంతా నిద్ర పోలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందా? రాదా? అన్న బెంగ ఆమెలో కనిపించిందని, గవర్నర్ ఏం చెబుతారోనన్న ఆందోళనా నెలకొందని పార్టీ నేత ఒకరు తెలిపారు. తనకు మంచి జరిగేలా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ ఆమె రాత్రంతా కాలం గడిపినట్టు తెలిసింది. తాను జైలుకు వెళ్లినా, పార్టీ పగ్గాలు మాత్రం పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా చూస్తానని ఆమె ఎమ్మెల్యేలతో చెప్పినట్టు సమాచారం.