: అవసరమైతే, వారం రోజుల పాటు ‘పోలవరం’లోనే ఉంటా: చంద్రబాబు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు పనులపై  సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి దేవినేని ఉమ, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. వర్చువల్ ఇన్ స్పెక్షన్ ద్వారా ప్రాజెక్టు పనులను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చే ప్రాజెక్టు ఇది అని, పనుల్లో వేగం పెంచాలని, అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆదేశించారు. పనుల్లో ఎప్పుడు సమస్య వచ్చినా తన వద్దకు రావాలని, ఎన్ని గంటలు అయినా సరే, కూర్చుని చర్చద్దామని, అవసరమైతే, వారం రోజుల పాటు అక్కడే ఉండి ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తానని చంద్రబాబు పేర్కొనడం గమనార్హం.

స్టీల్, సిమెంట్ కొనుగోలుకు ఆయా కంపెనీలతో నేరుగా మాట్లాడతానని, అవసరమైతే ప్రభుత్వం నుంచి నేరుగా చెల్లింపులు చేసి, వాటి కొరత లేకుండా చూస్తానని, పోర్టులో నిలిచిపోయిన మిషనరీని ప్రాజెక్టు ప్రాంతానికి తరలించేందుకు, ప్రభుత్వం తరపున ప్రత్యేకంగా ఓ లైజన్ అధికారిని నియమిస్తామని అన్నారు. లక్ష్యాలను చేరుకోవడానికి నిర్మాణ సంస్థలు చిత్తశుద్ధితో పనిచేయాలని, పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎగ్జిబిషన్, మ్యూజియం ఏర్పాటు చేస్తామని, వీటి బాధ్యతలు ప్రభుత్వ సలహాదారుడు పరకాల ప్రభాకర్ కు అప్పగించామని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News