: షారుఖ్ తో నాకు శృంగార సంబంధం ఉందన్న వార్త చాలా బాధ కలిగించింది: కరణ్ జొహార్


ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జొహార్ స్వలింగ సంపర్కుడని... పలువురు మగాళ్లతో ఆయనకు శృంగార సంబంధాలు ఉన్నాయంటూ బాలీవుడ్ మీడియాలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికీ వెలువడుతూనే ఉన్నాయి. అంతేకాదు, తన ఆత్మకథలో తాను స్వలింగ సంపర్కుడిననే విషయాన్ని కరణ్ జొహార్ కూడా కొంతమేరకు అంగీకరించాడు.

ఈ క్రమంలో, ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కరణ్ తన బాధను వ్యక్తీకరించాడు. వీకెండ్స్ లో జరిగే పార్టీలలో మగవారితో కలసి కనిపించాలంటేనే భయం వేస్తోందని... సోమవారం ఉదయానికల్లా ఆ ఫొటోలను ఫ్రంట్ పేజీల్లో ముద్రిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు, తనతో పాటు ఉన్న మేల్ సెలబ్రిటీకి ఏదో సంబంధం ఉన్నట్టు వార్తలు రాసేస్తున్నారని చెప్పాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో తనకు సంబంధం ఉన్నట్టు వచ్చిన వార్తలు తనను ఎంతో బాధించాయని... షారుఖ్ తనకు తండ్రిలాంటి వాడని అన్నాడు. షారుఖ్ తో తన పేరును ముడిపెట్టి రాయడం బాధాకరమని చెప్పాడు. 

  • Loading...

More Telugu News