: పాక్ రాజధానిలో నో వాలెంటైన్స్ డే... హైకోర్టు ఆదేశం!


యువత ముఖ్యంగా ప్రేమికులు రేపటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకు అంటే.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే కనుక. పాశ్చాత్య సంస్కృతి ప్రకారం ప్రేమికుల దినోత్సవంను ఘనంగా ఎంజాయ్ చేసేందుకు లవర్స్ సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అక్కడి యువతకు శరాఘాతంలా తగిలిందనే చెప్పవచ్చు. ముస్లిం సంప్రదాయం ప్రకారం వాలెంటైన్స్ డే జరుపుకోవడం నిషేధమని ఓ పిటిషనర్ వాదించాడు.

ఈ నేపథ్యంలో స్పందించిన ఇస్లామాబాద్ హై కోర్టు.. దేశ రాజధాని ప్రాంతంలో వాలెంటైన్స్ డే వేడుకలను నిషేధిస్తున్నట్టు ఆదేశించింది. బహిరంగ ప్రదేశాల్లో ఈ వేడుకలు జరుపుకోవద్దని, కార్యాలయాల్లోనూ దీనిపై నిషేధం విధిస్తున్నట్లు, ‘ప్రేమ’ను ప్రమోట్ చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు, కవరేజ్ చేసేందుకు వీలు లేదని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియానూ ఆదేశించింది. ఈ మేరకు తమకు సమాధానం ఇవ్వాలని సమాచార మంత్రిత్వ శాఖ, ఫెడరల్ ప్రభుత్వం, ఫెమ్రా చైర్మన్, చీఫ్ కమిషనర్లను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News