: పన్నీర్ వర్గానికి షాక్... ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన పోలీసులు
తమిళ రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. పన్నీర్ వర్గానికి షాక్ తగలగా... శశి వర్గంలో ఆనందం వెల్లువెత్తుతోంది. గోల్డెన్ బే రిసార్టులో ఎమ్మెల్యేలను నిర్బంధించారని... ఒక్కొక్కరికి నలుగురు గూండాలను కాపలాగా పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించి, నివేదిక సమర్పించాలని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు పోలీసులు నివేదిక సమర్పించారు.
రిసార్టులో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని... వారంతా స్వచ్చందంగానే అక్కడ ఉన్నట్టుగా తమతో చెప్పారని నివేదికలో పోలీసులు పేర్కొన్నారు. దీంతో సీన్ రివర్స్ అయింది. పన్నీర్ సెల్వం శిబిరం ఆశల మీద నీరు చల్లినట్టైంది.