: విజయానికి ఒక వికెట్ దూరంలో టీమిండియా
హైదరాబాదు ఉప్పల్ స్టేడియం మరోసారి టీమిండియాకు కలిసి వస్తోంది. ఉప్పల్ స్టేడియంలో భారత్ కు ఘనమైన చరిత్ర ఉంది. జట్టును విజయాలబాట నడిపిన పిచ్ గా ఉప్పల్ పిచ్ ను ధోనీ, యువీ వంటివారు పేర్కొంటారు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఒకేఒక్క టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. 459 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తడబడ్డారు. దీంతో బంగ్లా వడివడిగా వికెట్లు కోల్పోయింది. బంగ్లా కీలక ఆటగాళ్లు మహ్మదుల్లా 64, సౌమ్యా సర్కార్ 42 పరుగులతో జట్టును డ్రా దిశగా నడిపించాలని భావించినా టీమిండియా బౌలర్ల ముందు వారి పప్పులు ఉడకలేదు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 97.5 ఓవర్లలో 249 పరుగులకు 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, జడేజా నాలుగు వికెట్లు తీసి రాణించగా, ఇషాంత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి.