: ఆ రోజు చిరంజీవి స్పృహ కోల్పోయి పడిపోయారు: రాజా రవీంద్ర
క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు పరిచయం అయిన రాజా రవీంద్ర... సినీ రంగంలో అనేక మంది స్టార్లకు పర్సనల్ మేనేజర్ గా పనిచేశారు. ఇప్పటికీ ఎంతో మంది డేట్స్ ఆయనే చూస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవితో కూడా ఆయన దాదాపు పదేళ్ల పాటు కలసి ప్రయాణించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాజా రవీంద్ర మాట్లాడుతూ, 'జగదేకవీరుడు.. అతిలోక సుందరి' సినిమా సందర్భంగా జరిగిన ఓ ఘటనను గుర్తుకు తెచ్చుకున్నారు.
'అబ్బనీ తియ్యనీ దెబ్బ' పాట షూటింగ్ జరుగుతున్న సమయంలో చిరంజీవి 104 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారని... షూటింగ్ ఆలస్యమైతే శ్రీదేవి డేట్స్ అయిపోతాయనే కారణంతో అంత జ్వరంలోనూ ఆయన షూటింగ్ కు వచ్చారని రాజా రవీంద్ర తెలిపారు. పాట షూటింగ్ కొనసాగిన సమయమంతా చిరంజీవికి జ్వరం తగ్గలేదని... చివరి రోజు షూటింగ్ లో ఆయన స్పృహ కోల్పోయి, పడిపోయారని చెప్పారు. రెండు రోజుల వరకు కళ్లు తెరవలేదని తెలిపారు. తాము చేస్తున్న పని పట్ల ఇంత అంకితభావం తాను మరే నటుడిలో చూడలేదని ప్రశంసించారు.