: యూపీ ఎన్నికల బరిలో 107 మంది నేర చరితులు.. బోల్డన్ని కేసులు!


ఉత్తరప్రదేశ్‌లో జరగుతున్న శాసనసభ ఎన్నికల బరిలోకి దిగిన వారిలో నేరచరితులే ఎక్కువమంది కనిపిస్తున్నారు. హత్యలు, హత్యాయత్నం, అపహరణ, మహిళలపై దాడుల కేసులు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల బరిలో ఉన్నారు. ఈనెల 15న జరిగే రెండో దశ ఎన్నికల్లో పోటీకి దిగిన వారిలో ఏకంగా 107 మంది అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి ప్రమాణ పత్రాల్లో స్వయంగా వెల్లడించారు.

107 మందిలో 84 మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై దాడులు వంటి తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫామ్స్(ఏడీఆర్) వెల్లడించింది. మొత్తం బరిలో ఉన్న అభ్యర్థుల్లో 475 మంది 25- 50 ఏళ్ల లోపు వారు కాగా, 233 మంది 51-80 ఏళ్లలోపు వారు ఉన్నట్టు ఏడీఆర్ పేర్కొంది. 15న జరగనున్న ఎన్నికల్లో 69 మంది మహిళలు పోటీలో ఉన్నట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News