: ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడిని!!: పవన్ నోటి వెంట సంచలన వ్యాఖ్య


తన జీవితంలో తీవ్రమైన ఒత్తిడికిలోనై పలుమార్లు ఆత్మహత్య చేసుకోవాలని భావించానని, వాటిల్లో ఏ ఒక్కటి సక్సెస్ అయినా, తానిక్కడ నిలబడి ఉండేవాడిని కానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిన్నతనంలో టీచర్లు చెప్పిన అంశాలు నిజ జీవితంలో కనిపించక, చదివేది, చూసేది వేరువేరని మనసుకు తెలుస్తుంటే, వాస్తవం చెప్పేవారు లేక తానెంతో మానసిక క్షోభను అనుభవించానని హార్వార్డ్ వర్శిటీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చెప్పారు.

టీచర్లు తనను కొడుతూ ఉంటే ఒక్కోసారి తట్టుకోలేకపోయానని అన్నారు. తన ఫ్రెండ్స్ అంతా పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళుతుంటే, తన మనసు బాధపడేదని, తాను వెళ్లలేకపోయినందుకు చింతించానని చెప్పారు. పదో తరగతి నుంచి అన్ని క్లాసులూ తప్పుతూనే వచ్చానని అన్నారు. ఎన్నోసార్లు ఇక జీవితం వద్దని భావించానని చెప్పారు. జీవితంలో ఎటు వెళ్లాలో నిర్ణయం తీసుకోలేకపోయిన రోజున, ఒడిదుడుకులు ఎదురైన రోజున ఆత్మహత్య చేసుకోవాలని భావించి, ప్రయత్నించి విఫలమైనానని చెప్పుకొచ్చారు. ఆయన ప్రసంగం ఉత్తేజ భరితంగా సాగుతోంది.

  • Loading...

More Telugu News