: శశికళ వర్గం నాయకుడి దారుణ హత్య!
శశికళ వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత హత్యకు గురయ్యారు. తిరువన్నామలై నగర మాజీ కార్యదర్శి, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్ వి.కనకరాజ్ (40) ఈరోజు ఉదయం హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు నడిరోడ్డుపై కత్తులతో నరికి ఆయన్ని చంపారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ, ఆర్థికపరమైన లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని, కనకరాజ్ ను హత్య చేసింది తామేనంటూ డీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలు లొంగిపోయారని, వారి పేర్లు బాబు (28), రాజా (35), శరవణన్ (30) గా గుర్తించామని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించామని, ఈ సంఘటన సీసీ టీవీలో రికార్డు అయిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించామని, ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.