: శశికి పెద్ద షాక్... ఐదుగురు మంత్రులు జంప్!
గడచిన మూడు రోజులుగా శశికళ శిబిరంలో ఉన్న అన్నా డీఎంకే మంత్రుల్లో ఐదుగురు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం గూటికి చేరి పోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యా శాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్ లు పన్నీర్ సెల్వంకు జై కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ఐదుగురు కూడా సెల్వం వైపు చేరారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిన్న గోల్డెన్ బే రిసార్ట్ లో తనవర్గం ప్రజా ప్రతినిధులతో శశి సమావేశమైన తరువాత ఈ మంత్రులు, మరో ఎంఎల్ఏ ఫిరాయించినట్టు తెలుస్తోంది.
ఇంకా శశికళ శిబిరంలో ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రులు కూడా మాయమైనట్టు వార్తలు వస్తున్నాయి. అటవీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, పాడి పరిశ్రమ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్ శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఎపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమిన్, మాజీ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీలు శశికళకు హ్యాండిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. కాగా, శశికళ తన శిబిరంలోని 30 మందిని ఆంధ్రప్రదేశ్ లోని ఓ రహస్య ప్రాంతానికి తరలించారు.