: యస్... వైఎస్ రాజశేఖరరెడ్డి గారు మగాడు!: ఎమ్మెల్యే రోజా
జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే తనను గన్నవరం విమానాశ్రయం వద్ద పోలీసుల అదుపులోకి తీసుకోవడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఏ రోజూ ప్రత్యర్థిగా చూడలేదని, నేడు సీఎం చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, ‘యస్... వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మగాడు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండి పొలిటికల్ గా పోరాడినప్పుడు.. నన్ను ఒక పొలిటికల్ లీడర్ గా.. ఒక ఇష్యూ బేస్డుగా మాట్లాడిన మహిళా నాయకురాలిగా చూశారే తప్పా, ఏ రోజూ నన్ను ప్రత్యర్థిగానో, శత్రువు లాగానో చూసి.. నన్ను నాశనం చెయ్యాలన్న ప్రయత్నం చెయ్యలేదు. కానీ, చంద్రబాబునాయుడు కోసం.. సొంత అన్న కోసం కష్టపడ్డట్లు పదేళ్లు కష్టపడ్డాను. షూటింగ్ లేదు, ఇళ్లు లేదు, వాకిలి లేదు.. రాత్రింబవళ్లు పని చేశా. నా కొడుకు చనిపోయే పరిస్థితి.. అయినా, బొబ్బిలి బై ఎలక్షన్ లో ఆయన కోసం పనిచేశా... నన్ను ఒక రెడ్డిగా చూశారు... ఈ రోజున నేను అసెంబ్లీలో అడుగు పెడితే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు...’ అని రోజా మండిపడ్డారు.