: రిసార్ట్ నుంచి నిరాశతో వెనుదిరిగిన శశికళ!
తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో గవర్నర్ విద్యాసాగర్ రావు ఎదుట పరేడ్ నిర్వహిస్తానన్న శశికళ వెనక్కి తగ్గారు. గోల్డెన్ బే రిసార్ట్స్ లో తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలతో భేటీ అనంతరం, ఆమె ఒంటరిగా వెనుదిరిగారు. ఉత్సాహంగా రిసార్ట్ లోకి వెళ్లిన శశికళ, బయటకు తిరిగి వచ్చేటప్పుడు నిరాశతో వచ్చారు. ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయి మద్దతు లభించకపోవడంతో ఆమె నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.
పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోవడంతో రిసార్ట్స్ నుంచి నేరుగా పొయెస్ గార్డెన్ కు శశికళ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అయితే, రాజ్ భవన్ ఎదుట ఆందోళన చేయాలా? వద్దా? అనే విషయమై శశికళ ఊగిసలాటలో పడినట్లు తెలుస్తోంది. కాగా, కొంత మంది ఎమ్మెల్యేలు తనకు అనుకూలంగా లేకపోవడంతో అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా సెంగొట్టయన్ పేరును ఆమె బయటకు తీసినట్లు సమాచారం.