: చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు నాపై దాడి చేశారు: రోజా


అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళుతుండగా తనను అడ్డుకోవడంపై ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సుకు నన్ను ఆహ్వానించారు. ఆహ్వానం పంపించి మరీ, నన్ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు నాపై దాడి చేశారు. చంద్రబాబు నాయుడు మహిళల వ్యతిరేకి. ఈ సంఘటనతో మహిళల పట్లచంద్రబాబు ధోరణి బయటపడింది.

అంతేకాదు, తనపైన, తన కుటుంబసభ్యులపైన కోడెల శివప్రసాద్ వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన కోడలు చేసిన ఆరోపణలపై ప్రభుత్వం ఇంతవరకు స్పందించటం లేదు. ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఒక మహిళా ఎమ్మెల్యేగా నేను అప్ లోడ్ చేస్తే దాన్ని తప్పుబడుతున్నారు. స్పీకర్ గారి క్యారెక్టర్ ఏంటన్నది, ప్రతి ఒక్కరికీ తెలియాలి. ఇంట్లో ఏం చేస్తారు? బయట ఏం చేస్తారు? కోడలి దగ్గర ఏం చేస్తారు? అనే విషయాలు అందరికీ తెలియాలి. స్పీకర్ ఇంట్లోనేమో కోడలి ఆర్తనాదాలు.. ఎయిర్ హోస్టెస్ దగ్గరేమో దురుసు ప్రవర్తన.. అమరావతిలో మాత్రం మహిళా సాధికారత కోసం స్పీకర్ నీతులు మాట్లాడుతున్నారు! స్పీకర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తుంటే.. ఆడది వంటింట్లో ఉండాలన్నారు. మహిళల పట్ల స్పీకర్ కు ఎంత చిన్నచూపు ఉందో ఈ మాటలు చాలు’ అని రోజా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News