: తనను వదిలి వెళ్లద్దని ఎమ్మెల్యేలతో ఉద్వేగంగా మాట్లాడిన శశికళ
గోల్డెన్ బే రిసార్టులో ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో శశికళ నటరాజన్ సుమారు గంటసేపు చర్చించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో తమ నేతలకు శశికళ కీలక సూచనలు చేశారు. తమపై తిరుగుబాటు చేస్తోన్న ప్రత్యర్థుల పన్నాగాలను తిప్పికొడదామని ఆమె పిలుపునిచ్చారు. జయలలిత ఆశయాలు నెరవేరాలంటే తామంతా ఐకమత్యంగా ఉండాలని సూచించారు. తనను వదిలి వెళ్లద్దని ఆమె ఉద్వేగంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం ఆమె అక్కడి నుంచి బయలుదేరారు. ఆమె తదుపరి పోయెస్ గార్డెన్‌కు వెళతారా? లేక జయలలిత సమాధి వద్దకు వెళతారా? అనే అంశం తెలియాల్సి ఉంది.