: జయ సమాధి వద్ద మెరుపు ధర్నాకు సిద్ధమవుతున్న శశికళ?
ఎలాగైనా ముఖ్యమంత్రి పదవిని అధిష్టించాలని గట్టి పట్టుదలతో ఉన్న శశికళకు... తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ధోరణి మింగుడు పడటం లేదు. తనకు పూర్తి బలం ఉందని, బలపరీక్షకు తమను ఆహ్వానించాలని కోరుతున్నా... గవర్నర్ పట్టించుకోకపోవడం ఆమెలో అసహనాన్ని పెంచుతోంది. ఈ క్రమంలో గవర్నర్ కు ఆమె మరో లేఖ రాశారు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం జయలలిత స్మారకం వద్దకు ఆమె బయల్దేరారు. అయితే, అక్కడకు చేరగానే, ఆమె ధర్నాకు దిగే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమయింది.