: వెంకయ్య కూతురు, కేసీఆర్ కూతురు మాట్లాడవచ్చు.. నేను మాట్లాడకూడదా?: ఎమ్మెల్యే రోజా
ప్రస్తుతం తాను ఒంగోలు రోడ్డులో ఉన్నానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ఓ వీడియో ద్వారా తెలిపారు. అమరావతిలో జరుగుతున్న మహిళ పార్లమెంటేరియన్ల సదస్సులో పాల్గొనేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టుకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అనంతరం ఆమెను పోలీసు వాహనంలో తిప్పుతున్నారు. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన తనను దౌర్జన్యంగా అదుపులోకి తీసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.
వారి గురించి భజన చేసే వారే సదస్సుకి వచ్చి మాట్లాడాలా? అని ఆమె ప్రశ్నించారు.
అక్కడ మహిళ కోసం నిజంగా చాలా గొప్పగా సదస్సు నిర్వహిస్తున్నారేమో అని తాను అనుకున్నానని రోజా వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడి కూతురిని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురిని పిలిపించుకొని సదస్సులో మాట్లాడించారని, వారు మాట్లడవచ్చు కానీ.. తనను మాత్రం అడ్డుకుని, మాట్లాడకుండా చేస్తారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా మహిళ పార్లమెంటు నిర్వహించడం లేదని ఆమె అన్నారు.