: అరుదైన ఘనత సాధించిన విరాట్ కోహ్లీకి ప్రముఖుల ప్రశంసలు


భార‌త్‌, బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రుగుతున్న టెస్టు మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ డ‌బుల్ సెంచ‌రీ సాధించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆట‌తీరును ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియాలో ప‌లువురు ప్ర‌ముఖులు, అభిమానులు ట్వీట్ల వ‌ర్షం కురిపించారు. వరుసగా నాలుగు సిరీస్‌ల్లో డ‌బుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మెన్ కోహ్లీ.. కెప్టెన్‌గా మరిన్ని రికార్డులు సొంతం చేసుకోవాలని క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్ పేర్కొన్నాడు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన కోహ్లీని యువత ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ ట్వీటు చేశారు. టెన్నిస్‌ క్రీడాకారుడు రోహన్‌ బోపన్న స్పందిస్తూ.. టెన్నిస్‌లో ఇవో కార్లొవిక్‌ ఏస్‌లు సాధించినట్లు క్రికెట్‌లో కోహ్లీ సరికొత్త రికార్డు సాధించాడని పేర్కొన్నాడు.


  • Loading...

More Telugu News