: మంత్రి ‘బొజ్జల’ తనయుడు తనను చంపేస్తానంటున్నాడని వైఎస్సార్సీపీ నేత ఫిర్యాదు!
ఏపీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి తనను చంపేస్తానంటున్నాడని శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ఆరు నెలల్లోగా తనను చంపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో కలిసి తిరుపతిలో ఎస్పీని ఆయన కలిశారు. సుధీర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆ ఫిర్యాదులో కోరారు.