: అందుకే శశికళ వర్గాన్ని కాదని ప‌న్నీర్ వ‌ద్ద‌కు వచ్చేశా: కారణాలను చెప్పిన అన్నాడీఎంకే నేత మధుసూదనన్

అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన మధుసూదనన్ తాను త‌మిళ‌నాడు ఆపద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్ సెల్వానికి మద్దతివ్వడానికి కారణాలను మీడియాకు వివ‌రించి చెప్పారు. జయలలిత మృతి తర్వాత శశికళ త‌మ‌ పార్టీని ఏకతాటిపై నడుపుతారని తాను అనుకున్నాన‌ని చెప్పారు. అయితే, పార్టీలో శ‌శిక‌ళ కుటుంబ సభ్యుల పెత్తనం పెరిగిందని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక ఆమె కుటుంబానికి ఊడిగం చేయలేకే తాను ప‌న్నీర్ సెల్వం వ‌ద్ద‌కు వ‌చ్చేశాన‌ని అన్నారు.

పన్నీర్ సెల్వానికి పార్టీలో అవమానం జరిగిన విష‌యం మొద‌ట్లో తాను తెలుసుకోలేక‌పోయాన‌ని, అనంత‌రం ఆ విషయం తెలుసుకుని బాధపడ్డానని మ‌ధుసూద‌నన్‌ తెలిపారు. ఇక త‌న‌కు కూడా అవ‌మానం జ‌రిగే అవ‌కాశం  ఉంద‌ని భావించి శశికళ వ‌ర్గం నుంచి వ‌చ్చేశాన‌ని అన్నారు. అన్నాడీఎంకే పార్టీని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. తాము మొద‌ట‌ శశికళ ఒక్కరే పార్టీని నడుపుతారనుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, పార్టీ పెత్త‌నంలోకి మెల్లిగా ఆమె మేనల్లుడు దినకరన్ వ‌చ్చార‌ని, అనంత‌రం ఆమె కుటుంబ సభ్యులందరూ వ‌చ్చేశార‌ని ఆయ‌న చెప్పారు.

More Telugu News