: ఆమోదించిన రాజీనామాను పన్నీర్ సెల్వం వెనక్కి ఎలా తీసుకుంటారు?: సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి రూపంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మద్దతు లభించింది. శశికళకు అనుకూలంగా సుబ్రహ్మణ్యస్వామి తాజాగా వ్యాఖ్యలు చేయడం విశేషం. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు వీకే శశికళను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్వీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకోవడం, టూత్ పేస్ట్ ను తిరిగి ట్యూబులో పెట్టడం వంటిదిగా అభివర్ణించారు.

‘‘పన్నీర్ సెల్వం తనకు మద్దతిస్తున్న చట్టసభ సభ్యుల జాబితాను ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన కేవలం తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలనే అనుకుంటున్నారు. కానీ, అది ఇప్పటికే ఆమోదించబడింది. మరి ఆయన ఎలా ఉపసంహరించుకుంటారు?’’ అని సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. గవర్నర్ కు ఏదైనా అవకాశం ఉందంటే, రాజ్యాంగబద్ధమైన తన విధులకు లోబడి శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో బలనిరూణ చేసుకోవాలని కోరడమే అని పేర్కొన్నారు.

More Telugu News