: చిన్నమ్మకు ఊహించని విధంగా భారీ ఊరట.. సుప్రీం తీర్పు వాయిదా పడే అవకాశం!
ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు ఉత్సాహం చూపుతున్న శశికళకు భారీ ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నంబరు 2గా ఉన్న శశికళపై సోమవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి ఉంది. అయితే తాజాగా తీర్పు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పు ఆలస్యం అయితే శశికళకు సీఎం పీఠం అధిష్టించే చాన్స్ ఎక్కువ అవుతుంది. కోర్టు తీర్పు ఆలస్యానికి స్పష్టమైన కారణం తెలియకున్నా వాయిదా మాత్రం పక్కా అని చెబుతున్నారు. ఈ కేసులో కోర్టు కనుక శశికళను దోషిగా నిర్ధారిస్తూ తీర్పిస్తే శశికళ శకం ముగిసినట్టే. సీఎం పగ్గాలు అందుకోవాలని భావిస్తున్న ఆమెకు తీర్పు పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది. అంతేకాదు కొంతకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉండదు. కోర్టు తీర్పు వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తతో శశికళ వర్గం సంబరాలు చేసుకుంటోంది.