: ‘పన్నీర్’ బలం నిరూపించుకోవాల్సి వస్తే మద్దతిస్తాం: డీఎంకే
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు అవసరమైతే తమ మద్దతు ఉంటుందని డీఎంకే నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ సుబ్బలక్ష్మి జగదీశన్ తాజాగా ఒక ప్రకటన చేశారు. అసెంబ్లీలో పన్నీర్ సెల్వంకు బలం నిరూపించుకునే అవకాశం లభిస్తే కనుక ఆయనకు మద్దతుగా తమ పార్టీ నిలుస్తుందని స్పష్టం చేశారు.
కాగా, డీఎంకే నేతలు స్టాలిన్, కనిమొళి కూడా ఇప్పటికే ఈ విషయమై మాట్లాడారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని కనిమొళి చెప్పినప్పటికీ, పన్నీర్ సెల్వం బలం నిరూపించుకోవాల్సి వస్తే ఆ పార్టీ అండగా నిలబడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పన్నీర్ సెల్వంను తమ పార్టీ సమర్థించడం లేదని, కానీ, అంశాల పరంగా ఆయన్ని సమర్థిస్తున్నామంటూ స్టాలిన్ తన దైన శైలిలో ఇటీవల ప్రకటించడం తెలిసిందే.