: గవర్నర్ తో ముగిసిన పన్నీర్ సెల్వం భేటీ.. బలనిరూపణకు అవకాశం కోరిన ముఖ్యమంత్రి!
తమిళనాడులో వేగంగా మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చెన్నైలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పన్నీర్ సెల్వం భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, వారి భేటీ కేవలం 20 నిమిషాల్లోనే ముగిసింది. బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని విద్యాసాగర్ రావుని పన్నీర్ సెల్వం కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఎమ్మెల్యేల మద్దతు వివరాలను కూడా ఆయన తెలిపినట్లు తెలుస్తోంది.