: బ్రాహ్మణ, కాపు తదితర కార్పొరేషన్లకు రూ. 5 వేల కోట్ల రుణాలు... ఇండియన్ బ్యాంకు నిర్ణయాన్ని స్వాగతించిన చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్ లోని పలు కులాల కార్పొరేషన్లకు రూ. 5 వేల కోట్ల మేరకు రుణాలను అందించేందుకు ఇండియన్ బ్యాంకు అంగీకరించింది. ఈ మేరకు బ్యాంకు, ఏపీ ప్రభుత్వం మధ్య గురువారం ఒప్పందం జరుగగా, బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వెనుకబడిన అన్ని కులాల్లోని వారినీ అభివృద్ధి పథంలోకి నడిపించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని బ్రాహ్మణ, కాపు, ఎస్సీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు ఈ రుణాలను అందిస్తామని, వీటి ద్వారా ఆయా కులాల్లోని పేద విద్యార్థులకు, ఔత్సాహికులకు తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News