: శశికళ ప్రయత్నాలపై సుప్రీంకోర్టులో పిటిషన్.. రేపు వాదనలు వింటామన్న న్యాయస్థానం
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ చేస్తోన్న ప్రయత్నాలపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దానిపై రేపు వాదనలు వింటామని ప్రకటించింది. ప్రజాప్రతినిధిగా ఇప్పటివరకు ఎన్నిక కాకపోవడంతో పాటు అన్నాడీఎంకే పార్టీలో ఇంతకు ముందు ఏ బాధ్యతా చేపట్టని శిశికళ.. ఏకంగా ముఖ్యమంత్రి పదవికి ఎలా అర్హురాలు అవుతుందని పిటిషనర్ ప్రశ్నించారు. మరోవైపు శిశకళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.