: నిజామాబాద్ జిల్లాలో సందడి చేసిన అక్కినేని నాగార్జున
రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సినిమా ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా కనిపిస్తోన్న నాగర్జున ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో సందడి చేశారు. జిల్లాలోని నర్సింపల్లిలోని ఇందూరు తిరుమల దేవాలయానికి తమ చిత్ర బృందంతో కలసి వచ్చిన ఆయన అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వేంటేశ్వరుడి భక్తుడు హథీరాం బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వేంకటేశ్వరస్వామిగా నటించాడు. దేవాలయానికి వచ్చిన నాగార్జునాను చూసేందుకు అక్కడి భక్తులు ఎగబడ్డారు.