: తమిళనాడులో ఎమ్మెల్యేలను అక్రమంగా నిర్బంధించారు: కోర్టులో పిటిషన్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన విభేదాలు ఎత్తుకు పై ఎత్తు వేసే దిశగా సాగుతున్నాయి. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ నటరాజన్ తన వైపు ఉన్న ఎమ్మెల్యేలను గోల్డెన్ బే రిసార్ట్‌కు తరలించిన విషయం తెలిసిందే. వారింకా అక్కడే గడుపుతున్నారు. అయితే, ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించడం పట్ల ఓ సామాజిక కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ ఓ న్యాయస్థానంలో ఆయన పిటిషన్ వేశారు. ఈ విషయంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.