: రెండోసారి పెళ్లి చేసుకున్న 'బిచ్చగాడు' హీరోయిన్
విజయ్ ఆంటోనీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'బిచ్చగాడు'. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై... సంచలన విజయం సాధించింది ఈ చిత్రం. తెలుగులో కూడా కోట్లాది రూపాయల కలెక్షన్లను ఈ సినిమా కొల్లగొట్టింది. ఈ సినిమాలో కథానాయికగా నటించిన సట్నా టైటస్ మంచి మార్కులు కొట్టేసింది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే, 'బిచ్చగాడు' సినిమాను తమిళంలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ను గత ఏడాది సెప్టెంబర్ లో రిజిస్టర్ ఆఫీస్ లో రహస్యంగా పెళ్లి చేసుకుంది సట్నా. అప్పుడు వారి తల్లిదండ్రులు వివాహానికి అంగీకరించకపోవడంతో రహస్యంగా పెళ్లాడారు వీరు. ఇప్పుడు, అంటే 5 నెలల తర్వాత తల్లిదండ్రులను ఒప్పించగలిగారు. దీంతో, చెన్నైలో మరోసారి ఘనంగా పెళ్లి చేసుకున్నారు సట్నా, కార్తీక్ లు. ఈ వెళ్లికి సినీ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ప్రస్తుతం సట్నా చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయని సమాచారం. కార్తీక్ కూడా తమిళంలోని పలు సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడట.