: తెలుగునాట విడుదలకాని సూర్య 'సింగం-3'!


తెలుగు రాష్ట్రాల్లో సూర్య అభిమానుల నిరీక్షణ కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం నేడు సూర్య తాజా చిత్రం 'సింగం-3' విడుదల కాలేదు. తమిళనాడులో మాత్రం చిత్రం విడుదలై మంచి టాక్ ను తెచ్చుకుంది. తొలి రెండు భాగాల మాదిరిగానే, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా చిత్రం ఉందని అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ షో పడలేదు. మధ్యాహ్నం నుంచి చిత్ర ప్రదర్శన ఉంటుందని నిర్మాతలు చెబుతున్నప్పటికీ, అదింకా కన్ఫర్మ్ కాలేదని థియేటర్ల యాజమాన్యం అంటోంది. ఇక చిత్రం విడుదల కాకపోవడానికి కారణాలు ఏంటన్న విషయం తెలియరాలేదు. ఇప్పటికే ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News