: పన్నీర్ సెల్వం ఓ కుట్రదారుడు, మోసగాడు: శశికళ నటరాజన్
అమ్మ జయలలిత చనిపోయిన వెంటనే తనను బాధ్యతలు చేపట్టాలని పార్టీ సభ్యులంతా కోరారని, అందుకే తాను పార్టీ పగ్గాలు చేపట్టానని శశికళ నటరాజన్ అన్నారు. చెన్నైలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో శశికళ సమక్షంలో నిర్వహించిన ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా శశికళ మీడియాతో మాట్లాడుతూ... తమ పార్టీ పునాదులను ఎవ్వరూ కదల్చలేరని చెప్పారు. పన్నీర్ సెల్వం ఓ కుట్రదారుడు, ద్రోహి అని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన పార్టీని మోసం చేశారని వ్యాఖ్యలు చేశారు. తాను 33 ఏళ్లు జయలలిత పక్కనే ఉన్నానని చెప్పారు. జయలలిత ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కున్నారని ఆమెకు అండగా ఉన్నానని చెప్పారు. పన్నీర్ సెల్వం పార్టీని మోసం చేశారని చెప్పారు.