: ఢిల్లీకి మేము వెళ్లం... అన్నాడీఎంకే నేతలే వెళ్లాలి: డీఎంకే నేత కనిమొళి
తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత కనిమొళి స్పందించారు. తమ రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తమ పార్టీ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీలను కలవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. అసలు కేంద్ర ప్రభుత్వ పెద్దలెవరినీ తాము కలవబోమని తేల్చి చెప్పారు. అన్నాడీఎంకేలోనే సమస్య ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలే ఢిల్లీకి వెళ్లి సమస్యను పరిష్కరించుకుంటారని తెలిపారు. ఢిల్లీకి వెళ్లడం తాము చేయాల్సిన పని కాదని అన్నారు.