: పన్నీర్ సెల్వం తీరుని ప్రజలు గమనించాలి: శశికళ నటరాజన్
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేయడంతో ఈ రోజు శశికళ నటరాజన్ 130 మంది పార్టీ ఎమ్మెల్యేలతో అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ సమావేశంలో శశికళ మాట్లాడుతూ అమ్మ జయలలిత బాటలోనే పయనిద్దామని అన్నారు. పన్నీరు సెల్వం వెనుక ఎవరు ఉండి నడిపిస్తున్నారో ప్రజలు గమనించాలని ఆమె పేర్కొన్నారు. తనను శాసన సభ పక్షనేతగా గుర్తించిన పన్నీర్ సెల్వం రెండు రోజులకే మాట మార్చారని ఆమె అన్నారు.