: ఈ సరస్సు, నా బైక్... ఎంత ఆనందమో: చికాగోలో రఘురాం రాజన్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా పదవీ విరమణ చేసిన రఘురాం రాజన్ తిరిగి చికాగో యూనివర్శిటీ పరిధిలోని బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో అధ్యాపకుడిగా చేరిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "చికాగో నగరంలో తిరిగి నా బైక్ పై పర్యటిస్తున్నా. ఎంత ఆనందంగా ఉందో. సాధ్యమైనంత కాలం అధ్యాపక వృత్తిని కొనసాగిస్తా. చికాగో సరస్సు వెంట నా బైక్ పై పర్యటిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి" అన్నారు.
ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, చికాగో, ఇల్లినాయిస్ మీదుగా సాగే మిచిగాన్ సరస్సు వెంబడి ఉన్న ఎక్స్ ప్రెస్ వేపై సొంతంగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్లడం తనకెంతో ఇష్టమని, ఈ పాఠశాల తనకు 25 సంవత్సరాల పాటు సొంతింటిలా ఆశ్రయం ఇచ్చిందని, ఇక్కడ తన సహాధ్యాయులు, మిత్రులు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా, 2013లో ఆర్బీఐ బాధ్యతలు చేపట్టిన ఆయన సెప్టెంబర్ 2016 వరకూ కొనసాగించిన సంగతి తెలిసిందే. వృద్ధి రేటు పెరిగేందుకు వడ్డీ రేట్లను తగ్గించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ, అంగీకరించక ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యమిచ్చిన ఆయనపై పలు విమర్శలు వచ్చాయి.