: పన్నీర్‌ సెల్వం వ్యాఖ్యలపై శశికళ నటరాజన్ స్పందించాలి: స్టాలిన్‌ డిమాండ్


తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చేసిన ప‌లు ఆరోపణల వెనుక త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే ఉందని శశికళ న‌ట‌రాజ‌న్ చేసిన‌ ఆరోపణలపై డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ స్పందించారు. ఈ రోజు చెన్నైలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ముందు ప‌న్నీర్ సెల్వం చేసిన ఆరోపణలకు శశికళ సమాధానం చెప్పాలని అన్నారు. అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదని ఆయ‌న పేర్కొన్నారు. ఆ పార్టీలో జ‌రుగుతున్న‌ అంతర్గత వ్యవహారాల్లో డీఎంకే జోక్యం చేసుకోదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

  • Loading...

More Telugu News