: చంద్రబాబును విలన్ గా చూపించాలి...ఎన్టీఆర్ సినిమాకు హీరో నేనే!: నాదెండ్ల భాస్కరరావు


ప్రముఖ నటుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ పై సినిమా తీస్తానని ఆయన కుమారుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ ప్రకటించిన తరువాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సినిమాలోని అంశాలపై ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి పలు హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ రాజకీయనాయకుడు నాదెండ్ల భాస్కరరావు కూడా హెచ్చరికలు చేశారు. ఎన్టీఆర్ పై నిర్మించే సినిమాకు హీరోను తానేనని ఆయన తెలిపారు. ఈ సినిమాలో అసలు విలన్ చంద్రబాబునాయుడని ఆయన చెప్పారు. టీడీపీని తాను స్థాపించానని ఆయన చెప్పారు. స్వార్థం కోసం టీడీపీ నేతలు పార్టీని ఎన్టీఆర్ స్థాపించాడని ప్రచారం చేసుకున్నారని తెలిపారు. ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించి, తమను విలన్స్ గా చూపించాలని ప్రయత్నిస్తే మాత్రం తాము చాలా విషయాలతో బయటకు రావాల్సి ఉంటుందని, రహస్యంగా ఉన్న విషయాలు వెల్లడించాల్సిన పరిస్థితిని తీసుకురావద్దని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News