: నటి పమేలా ఆండర్సన్ తో ‘వికీలీక్స్’ అధినేత డేటింగ్!
‘బే వాచ్’ నటి పమేలా ఆండర్సన్ తో ‘వికీ లీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రేమలో పడ్డారని ‘డైయిలీ మెయిల్’ పేర్కొంది. లండన్ లోని యూరోపియన్ ఎంబసీలో ఉంటున్న ఆయనను పమేలా ఐదుసార్లు కలిసిందని, ఆయన్ని కలిసిన ప్రతిసారి, అదిరిపోయే డ్రెస్సులు ధరించిందని రిక్స్ స్టెప్ న్యూస్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేసింది.
కాగా, పమేలా, అసాంజ్ తొలిసారిగా 2014 సెప్టెంబర్ లో కలుసుకున్నారు. లైంగిక వేధింపులకు గురైన మహిళల కోసం తాను ఏర్పాటు చేసిన ఫౌండేషన్ కు మద్దతు తెలపాల్సిందిగా అడిగే నిమిత్తం అసాంజ్ ను పమేలా కలిసింది. 2016 అక్టోబర్, నవంబర్ లో ఒకసారి, డిసెంబర్ లో రెండు సార్లు ఆయన్ని కలిసిందని మీడియా పేర్కొంది.