: విమానం ఎక్కకుండానే ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ‘ఇండిగో’!
నిర్ణీత సమయానికి బయలు దేరదని, ప్రయాణికులను వదిలి వెళ్లిపోతుందని ‘ఇండిగో’ విమానంపై ప్రయాణికుల ఫిర్యాదులు తరచుగా వినపడుతుంటాయి. తాజాగా, విమానం ఎక్కకుండానే తమ ప్రయాణికులకు ‘ఇండిగో’ సంస్థ చుక్కలు చూపిస్తోంది. విశాఖపట్టణం నుంచి బెంగళూరుకు ఈరోజు వెళ్లాల్సిన ‘ఇండిగో’ విమానం ఇంత వరకు రాకపోవడంతో ప్రయాణికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. విశాఖపట్టణంలో ఉదయం 7.45 గంటలకు బయలు దేరాల్సిన విమానం మధ్యాహ్నం వరకు రాలేదు. దీంతో, డెబ్భై మంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిన్న హైదరాబాద్ నుంచి కోల్ కతా వెళ్లే ఇండిగో విమానం 25 మంది ప్రయాణికులను వదిలి వెళ్లిపోయింది. దీంతో, ‘ఇండిగో’ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.