: బాలయ్యా... ముందే ఆలోచించుకో.. చరిత్రను వక్రీకరించద్దు!: లక్ష్మీపార్వతి హెచ్చరిక


దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీస్తానంటే, తాను ఎంతో ఆనందంతో స్వాగతిస్తానని, ఆ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను పోషించడం, ఆయన కుమారుడిగా బాలకృష్ణకు దక్కిన అదృష్టమని ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆమె, ఎన్టీఆర్ జీవితంలో జరిగింది జరిగినట్టుగా తీయాలని, అలా కుదరదు అనుకుంటే, ఆయన సాధించిన విజయాలను మాత్రమే చూపించాలని బాలకృష్ణకు సలహా ఇచ్చారు. చరిత్రను వక్రీకరించి చూపిస్తే మాత్రం తాను కోర్టుకెక్కి తీరుతానని హెచ్చరించారు. ఈ విషయంలో బాలయ్య ముందుగానే ఆలోచించుకోవాలని, చంద్రబాబును హీరోగా చూపిస్తూ, తనను దుష్టశక్తిని చేసి, తన నుంచి పార్టీని కాపాడినట్టు సినిమా తీస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఆయన భార్యగా తానింకా బతికే ఉన్నానని, చిత్ర కథలో తేడా వస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News