: కైలాష్ సత్యార్థి ఇంట్లోకి చొరబడిన దొంగలు... నోబెల్ ప్రైజ్ చోరీ
నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి ఇంట్లో దొంగతనం జరిగింది. నిన్న రాత్రి ఆయన ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు పలు విలువైన వస్తువులను చోరీ చేశారు. చోరీ అయిన వస్తువుల్లో కైలాస్ సత్యార్థికి లభించిన నోబెల్ బహుమతి కూడా ఉంది. ఆయన నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దేశంలో కొన్ని వేల మంది బాలకార్మికులకు విముక్తి కల్పించినందుకు గానూ, బాలల హక్కులపై ఉద్యమించినందుకు గానూ ఆయన 2014లో పాకిస్థాన్ బాలిక మలాలాతో కలిసి నోబెల్ శాంతి బహుమతి అందుకున్న విషయం తెలిసిందే.