: గూగుల్ పిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.9 వేల క్యాష్ బ్యాక్... ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్


గూగుల్ తాజా స్మార్ట్‌ఫోన్ ‘పిక్సెల్’పై ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ రాయితీని ప్రకటించింది. రూ.57 వేలు ఉన్న 32 జీబీ వేరియంట్ మొబైల్‌పై రూ.9 వేల క్యాష్ బ్యాక్  ప్రకటించింది. అయితే సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, ఎక్స్ఛేంజి ఆఫర్ ద్వారా కొనుగోలు చేసేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అలాగే ఒక కార్డుపై ఒకసారి మాత్రమే ఫోన్ కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

 క్రెడిట్ కార్డు ద్వారా నేరుగా డబ్బులు చెల్లించే వారికి రూ.9 వేల క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు పేర్కొన్న ఫ్లిప్‌కార్ట్ ఆ మొత్తం 90 రోజుల తర్వాత వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది. ఎక్స్ఛేంజి ద్వారా కొనుగులు చేసే వారికి ఫోన్‌ను బట్టి రూ.20,000 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు పేర్కొంది. పిక్సల్‌లోని 128 జీబీ వేరియంట్ ఫోన్‌కూ ఈ ఆఫర్ వర్తిస్తుందని ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ ఫోన్లు గతేడాది అక్టోబరులోనే భారత మార్కెట్లోకి వచ్చాయి.

  • Loading...

More Telugu News