: ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు!: పీఏ శేఖర్ వివాదంపై బాలకృష్ణ
తన పీఏ శేఖర్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణ స్పందించారు. శేఖర్ వివాదానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నామని, పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా, అవినీతికి పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. తనకు నిమ్మకూరు ఎలాగో, హిందూపురం కూడా అంతేనని, హిందూపురం అనేది తన కుటుంబంతో సమానమని అన్నారు. ఈ నియోజకవర్గానికి తన తండ్రి ఎన్టీఆర్ నాయకత్వం వహించారని, ఆయన ఆశయాలు ఎన్నో ఇంకా అమలు చేయాల్సినవి ఉన్నాయని అన్నారు. అనంతపురం జిల్లా మొత్తానికి అభివృద్ధి సాధించిన నియోజకవర్గంగా హిందూపురం ఉందని, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించమని, ఎందుకంటే, కొత్త తరం రావాలని, అవకాశాల కోసం వారు ఎదురుచూస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.