kamala hasan: సామాన్యుడి సహనాన్ని పరీక్షించకూడ‌దు: కమలహాసన్ సంచలన వ్యాఖ్యలు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మృతి అనంత‌రం ఆ రాష్ట్ర రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్న నేప‌థ్యంలో వాటిపై స్పందిస్తూ ప్రముఖ సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. సామాన్యుడి సహనాన్ని పరీక్షించకూడ‌ద‌ని ఆయ‌న త‌మిళంలో ట్వీటు చేశారు. గడ్డిపోచలన్నీ కలిస్తే మదగజాన్ని బంధించగలవని ఆయ‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం జ‌రిగిన జల్లికట్టు పోరాటంలోనూ ఆయ‌న పాల్గొన్న విష‌యం తెలిసిందే. తాజాగా ఆయన రాజకీయాలపై చేసిన ఈ ట్వీటు ఆసక్తికరంగా మారింది.



kamala hasan

More Telugu News